AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సినీ లవర్స్‌కు షాక్.. థియేటర్లు బంద్!

తెలుగు రాష్ట్రాల సినీ ల‌వ‌ర్స్‌ కు థియేట‌ర్ల యాజ‌మ‌న్యాలు ఊహించ‌ని షాక్ ఇచ్చాయి. ప‌ది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత ప‌డ‌నున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. అయితే గ‌త కొన్నాళ్లుగా తెలుగులో భారీ బ‌డ్జెట్ సినిమాలు ఏవి రిలీజ్ కావ‌డం లేదు. మ‌రోవైపు ఐపీఎల్‌, ఎలెక్ష‌న్స్ ఎఫెక్ట్ కార‌ణంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య భారీగా త‌గ్గింది. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల రెవెన్యూ భారీగా త‌గ్గిన‌ట్లు స‌మాచారం. నగరాలతో పోలిస్తే పట్టణాలు అలాగే మండలాలలో ఇది మరింత దారుణంగా ఉందని, తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్వ‌హ‌ణ వ్య‌యాలు కూడా రావ‌డం లేద‌ని స‌మాచారం. కాగా ఐపీఎల్‌ పూర్త‌య్యి ప‌రిస్థితులు మొత్తం సాధార‌ణ స్థితి చేరుకునే సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌ను మూసివేయాల‌ని తెలంగాణ థియేట‌ర్స్ ఓన‌ర్స్ అసోసియేష‌న్ నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. బుధ‌వారం ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెల్ల‌డించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ANN TOP 10