AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో 65.67 శాతం పోలింగ్: భువనగిరిలో అత్యధికం, హైదరాబాద్‌లో అత్యల్పం

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌​సభ ఎన్నికల్లో 65.67 శాతం ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలను మంగళవారం వెల్లడించారు.ప్రజలు చైతన్యవంతంగా కదిలి ముందుకు రావడంతో గత(2019) లోక్‌​సభ ఎన్నికల కంటే 3 శాతం ఎక్కువగా నమోదయిందని సీఈవో వికాస్​రాజ్​తెలిపారు. అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం పోలింగ్ నమోదయింది. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంటులో అత్యధికంగా 84.25 శాతం నమోదయిందని వికాస్ రాజ్ తెలిపారు. మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో అతి తక్కువగా 42.76 శాతం నమోదైందని వెల్లడించారు. జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.
17 నియోజకవర్గాల్లో నమోదైన ఓటింగ్​శాతాల వివరాలు :
ఆదిలాబాద్‌ ఎంపీ నియోజకవర్గం – 74.03 శాతం
పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గం – 67.87 శాతం
కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం – 72.54 శాతం
నిజామాబాద్‌ ఎంపీ నియోజకవర్గం – 71.92 శాతం
జహీరాబాబాద్‌ ఎంపీ నియోజకవర్గం – 74.63 శాతం
మెదక్‌ ఎంపీ నియోజకవర్గం – 75.09 శాతం
మల్కాజ్‌గిరి ఎంపీ నియోజకవర్గం – 50.78 శాతం
సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గం – 49.04 శాతం
హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గం – 48.48 శాతం
చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం – 56.50 శాతం పోలింగ్‌
మహబూబ్‌నగర్‌ ఎంపీ నియోజకవర్గం- 72.43 శాతం పోలింగ్‌
నాగర్‌కర్నూల్‌ ఎంపీ నియోజకవర్గం – 69.46 శాతం
​నల్గొండ ఎంపీ నియోజకవర్గం – 74.02 శాతం
​భువనగిరి ఎంపీ నియోజకవర్గం – 76.78 శాతం
వరంగల్‌ ఎంపీ నియోజకవర్గం – 68.86 శాతం
మహబూబాబాద్‌ ఎంపీ స్థానం – 71.85 శాతం
ఖమ్మం ఎంపీ నియోజకవర్గం – 76.09 శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన వెల్లడించారు.

ANN TOP 10