హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇక పాలనపై దృష్టి సారిస్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌కి, ఒక్క నియోజకవర్గం ఉన్న వనపర్తిని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారని చెప్పారు. పాలమూరుపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే స్పెషల్‌గా పాలమూరు జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలు ముగిశాయని… ఇక తన దృష్టి అంతా పరిపాలన పైనే అని తెలిపారు. బీఆర్ఎస్ ఎలక్షన్ ఎలా చేసిందనే దానిని బట్టి రిజల్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు.ఎవరి ఓట్లు నేతలు తీసుకుంటే ఎలక్షన్ అంచనా వేయొచ్చని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ 20 వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేశారు. అందుబాటులో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా.. అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేసి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.