AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేశారు. మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన మోడీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్‌ వేశారు.కాలభైరవ ఆలయంలో పూజలు నిర్వహించి అంతకుముందు గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో పూజలు చేసి హారతి ఇచ్చారు. ఇక మోడీ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా, బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ర్యాలీలో పాల్గొన్న తర్వాత బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.

ANN TOP 10