AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు.. జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఏపీలో 76.79 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదయినట్టు తెలుస్తోంది. మొత్తం పోలింగ్ ఎంత అనేది ఈరోజు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించనుంది.

జిల్లాలవారీగా ఓటింగ్ శాతం..
కోనసీమ- 83.19
తూర్పుగోదావరి- 79.31
పశ్ఛిమగోదావరి- 81.12
ఏలూరు- 83.04
కాకినాడ- 76.37

విజయనగరం- 80.33
మన్యం- 75.24
విశాఖపట్నం- 68.13
శ్రీకాకుళం- 74.99

చిత్తూరు- 84.71
తిరుపతి- 76.83
కృష్ణ- 82.20
ఎన్టీఆర్- 78.76
గుంటూరు- 75.74
పల్నాడు- 78.70

ఏలూరు జిల్లాలో 2019లో 83 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇప్పుడు పోలింగ్ 83.04 శాతం నమోదైంది. గతంలో కంటే కొద్దిగా పోలింగ్ పెరిగింది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం
ఏలూరు- 71.02
చింతలపూడి- 80.05
పోలవరం- 84.16
ఉంగుటూరు- 87.75
కైకలూరు- 87.5
నూజివీడు- 87.32
దెందులూరు- 85.01

పశ్చిమ గోదావరి జిల్లాలో 2019లో 81.19 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇప్పుడు 81.12 శాతం పోలింగ్ నమోదైంది. గతం కంటే 0.07 శాతం పోలింగ్తగ్గింది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం
ఆచంట- 82.79
పాలకొల్లు- 83.1
నరసాపురం-80.29
భీమవరం-78.42
ఉండి- 82
తణుకు- 82.08

విజయనగరం జిల్లాలో..
రాజాం- 75.83
చీపురుపల్లి- 82.90
బొబ్బిలి- 80.65
గజపతినగరం- 85.16
విజయనగరం- 71.49
నెల్లిమర్ల- 84.83
ఎస్ కోట-83.70

ANN TOP 10