AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని మోదీ నామినేషన్.. వారణాసిలో హ్యట్రిక్‌పై గురి

ఢిల్లీ : ప్రధాని మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమంలో 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొంటారు. నామినేషన్ కన్నా ముందు దశాశ్వమేధ ఘాట్‌ను ప్రధాని మోదీ సందర్శిస్తారు. తర్వాత క్రూజ్‌లో నమో ఘాట్ వెళతారు. అక్కడినుంచి కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు.

ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్బీ, బీజేపీ పాలిత రాష్ట్రాల 12 మంది ముఖ్యమంత్రులు, ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన నేతలు చంద్రబాబు (టీడీపీ), పవన్ కల్యాణ్ (జనసేన), జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ), అనుప్రియ (అప్నాదళ్), ఓంప్రకాశ్ రాజ్‌భర్ (సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ) తదితరులున్నారు.

ANN TOP 10