AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోసిపోయిన భాగ్యనగరం

నిత్యం కిక్కిరిసి పోయో హైదరాబాద్‌ ఎన్నికల వాతావరణంతో బోసిపోయింది. నిశ్శబ్ద వాతావరంలో ప్రజాజీవనం సాగింది. నిలిచి పోయిన వాహనాలు, ఆగిపోయిన పరిశ్రమల చక్రాలు,అధికారిక బంద్‌ పాటించిన వ్యాపారవాణిజ్యాలతో భాగ్యనగరం వన్నెతగ్గింది. దీనికి ప్రధానకారణం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్‌ నుంచి సొంత గ్రామాలకు ప్రజలు తరలి వెళ్లడంతో ఈ వాతావరణం ఆవిష్కృతమైంది.

రాష్ట్రంలోని హైదరాబాద్‌ తో పాటు ప్రధాన పట్టణాల్లో రహదారులు బోసిపోయాయి. వాహనాలు హోరు, జోరు కనిపించలేదు. రోడ్లపై వాహనాలు లేకపోవడంతో రహదారులు నిర్మానుష్యంగామారాయి. హైదరాబాద్‌ లోని ప్రధాన కూడలిల్లో అప్రకటిత కర్ఫ్యూ ప్రకటించినట్లుగా ఉంది. ఉపాధి, ఉద్యోగాలతో హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షలాది మంది తోపాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకూలీలు తమఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంత గ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్‌ బోసిపోయింది.

హైదరాబాద్‌ నుంచి గత మూడురోజుల్లో 25 లక్షల మంది ఏపీకి వెళ్లినట్లు నిఘా వర్గాలు అంచనావేశాయి. కేవలం 12వ తేదీన ఒక్కరోజులోనే సుమారు 7లక్షల మంది హైదరాబాద్‌ నుంచి ఏపీ కి వెెళ్తునట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ జిల్లాల్లోంచి హైదరాబాద్‌ లో స్థిరపడిన వారు తమ ఓటు హక్కు సొంత ఊర్లలో ఉండటంతో ఊరి బాటపట్టడంతో బస్తీల్లో జనసందడి తగ్గిపోయింది. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌,మంచిర్యాల,నిర్మల్‌, సిరిసిల్ల నుంచి అత్యధికంగా ఏపీకి తరలివెళ్లినట్లు సమాచారం. ఏపీలో ఉన్న తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వెళ్లారు.

ANN TOP 10