బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓటును వినియోగించుకునేందుకు మంగళ్ హాట్ పరిధిలోని ఎస్ఎస్‌కే జూనియర్ కళాశాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన ఆయన.. పోలింగ్ అధికారులపై అనుచిత కామెంట్స్ చేశారు. దీంతో ఎన్నికల అధికారులు ఆయనపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.









