హైదరాబాద్ : జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొబైల్ టిఫిన్ సెంటర్ను ఆర్టీసీ బస్సు ఢీకొడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రఘునాథపల్లిలో నేషనల్ హైవేపై హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్ను అతివేగంతో వచ్చిన ఆర్టీసీ గరుడ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అక్కడే టిఫిన్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









