హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) సోమవారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని రామ్‌నగర్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమని, ఓటుతో మార్పు తేవచ్చని అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చాలని కోరారు.









