AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ దౌర్జన్యం.. తిరగబడిన కాంగ్రెస్‌ మహిళా నేత మౌనరెడ్డి

(అమ్మన్యూస్, ఆదిలాబాద్‌):
ఆదిలాబాద్‌ జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, అతని అనుచరులు పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద దౌర్జన్యాలకు దిగుతున్నారు. కాషాయ కండువాలు ధరించడమేకాక ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతుండటం గమనార్హం. ఆదిలాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి, కాంగ్రెస్‌ మహిళా నేత కంది సాయి మౌన రెడ్డి పాయల్‌ శంకర్‌ తీరుపై మండిపడ్డారు. కండువాలతో పోలింగ్‌ కేంద్రాలలోకి ఎలా అనుమతి ఇస్తారని అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కంది మౌనరెడ్డి తిరగబడటంతో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అక్కడి నుంచి జారుకున్నారు. మౌనరెడ్డి ధైర్యాన్ని చూసి అక్కడున్న వారంతా అభినందించారు.

ANN TOP 10