(అమ్మన్యూస్, హైదరాబాద్):
ములుగు మండలం జగ్గన్నపేటలో మంత్రి సీతక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. అలాగే పోలింగ్ సరళిని పరిశీలించారు. అలాగే.. చేవెళ్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తమ కుటుంబంతో సహా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.









