AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓట్లర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్నారు. తమ వంతు వచ్చినప్పుడు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఈ క్రమంలో ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.51 శాతం పోలింగ్‌ నమోదయింది. నల్లగొండ లోక్‌సభ పరిధిలో 12.88 శాతం నమోదుకాగా, భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో 10.54 శాతం, నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో 10.9 శాతం, ఖమ్మం ఎంపీ పరిధిలో 12.24 శాతం, ఆదిలాబాద్‌లో 13.2 శాతం, జహీరాబాద్‌లో 12.8 శాతం పోలింగ్‌ నమోదయింది.

చేవెళ్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తమ కుటుంబంతో సహా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ANN TOP 10