AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభ ఎన్నికలకు అంతా రెడీ.. కాసేపట్లో పోలింగ్‌ షురూ..

తెలంగాణలో ఓటు హ‌క్కు వినియోగించుకోనున్న 3.32 కోట్ల మంది

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల‌కు నేడు పోలింగ్ జ‌ర‌గ‌నుంది.. అధికారులు సర్వం సిద్ధం చేశారు. …రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్‌ కేంద్రాల్లో 1,09,941 బ్యాలెట్‌ యూనిట్లు, 50,135 వీవీప్యాట్‌లు, 44,906 కంట్రోల్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 625మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఒక గంట ముందే పోలింగ్ ముగియ‌నుంది.మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అలాగే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక పోలింగ్ కూడా నేడే జ‌ర‌గ‌నుంది..

నాలుగో విడతలో భాగంగా జ‌రిగే పోలింగ్‌లో తెలంగాణ‌లోని 17 లోక్ సభ స్థానాల్లో 625 మంది రంగంలో ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి అత్యధికంగా 45 మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత మెదక్ నుంచి 44 మంది.. చేవెళ్ల నుంచి 43మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి నుంచి 42, కరీంనగర్ నుంచి 28, నిజామాబాద్ నుంచి 29, మహబూబ్ నగర్ నుంచి 31, నాగర్ కర్నూల్ నుంచి 19, నల్గొండ నుంచి 22, భువనగిరి నుంచి 39, వరంగల్ 40, మహబూబాబాద్ 23, ఖమ్మం నుంచి 35, హైదరాబాద్ లోక్ సభ సీటు నుంచి 30, మల్కాజ్‌గిరి 22, జహీరాబాద్ నుంచి 19, ఆదిలాబాద్‌లో అతి తక్కువగా 12 మంది బరిలో ఉన్నారు. 17లోక్ సభ సీట్లలో ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు.. కాగా, అన్ని స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం ఒక్క హైద‌రాబాద్‌లోనే పోటీలో ఉంది.

ANN TOP 10