ఆంధ్రాలో అధికారం ఎవరిది? జగన్ వర్సెస్ బాబు పంచాయతీ లో నెగ్గేదెవరు? వైసీపీకి అధికారం నిలబెట్టుకోవడం కీలకం. గ్రామీణ ఓటు బ్యాంకు, మహిళలు వైసీపీకి ప్లస్. టిడిపి కూటమి ప్రభుత్వ వ్యతిరేకత పైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. చంద్రబాబు అనుకూలతలను, విజయాలను సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది. జగనే లక్ష్యంగా సాగిన ప్రచారం చివరకు ఎవరికి అనుకూలిస్తుంది అనేది సోమవారం ఓటరు తీర్పు చెప్పబోతున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిపై సాగిన హైప్ ఈసారి పిఠాపురం పై నెలకొంది. పిఠాపురం లో పవన్ కు ఎదురీత తప్పదా.. బయటపడతాడా అన్నది కూటమి వేవ్ ను బట్టి ఆధారపడి ఉంది. మంగళగిరి నుండి లోకేష్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమేనన్న చర్చ ఉంది.
నాడు లగడపాటి నేడు
గత ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ను ప్రవేశ పెట్టినట్లు ఈ ఎన్నికల్లో ఈనాడు రామోజీరావు, ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు ప్రవేశ పెట్టాడని వైసిపి విమర్శలు చేస్తోంది. ఈనాడు ముసుగు తొలగించుకుని జగన్ ను ఓడించాలని బహిరంగంగా పిలుపు నివ్వగా, రవిప్రకాష్ ను కూడా అలాగే బాబు వినియోగించుకున్నారని వైసిపి విమర్శలు చేసింది. ఈ ప్రయోగాలు హిట్టయితే బాబుకు మళ్లీ జవసత్వాలు వచ్చినట్లే.









