హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు పయణమయ్యారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. బస్సులతోపాటు సొంత వాహనాల్లో ఓటర్లు తరలివెళ్తుండటంతో ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. ఎల్బీనగర్ నుంచి పనామా వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.









