AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్త జనం

హైదరాబాద్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రాకతో దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వీకెండ్‌ సెలవులతో ఆదివారం స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచివున్నారు. కాగా, ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది.

ANN TOP 10