అమ్మన్యూస్ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఆదిలాబాద్ లో గెలుపెవరది? ఆదిలాబాద్ సెంటిమెంట్ ప్రకారం ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ ఎంపీ అభ్యర్ధిని ఎన్నుకుంటారు? ఈ ఎన్నికల్లోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫైనల్ సర్వే తేల్చిచెబుతోంది. ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఆత్రం సుగుణ గెలుపుబాటలో దూసుకుపోతున్నదని సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయి. ఫైనల్ సర్వే రిపోర్ట్‌లో కాంగ్రెస్ 45 శాతం ఓటింగ్ సాధించనుండగా.. బీజేపీ 27.16, బీఆర్ఎస్ 25.84 శాతం ఓట్లు సాధించనున్నట్లు ఫైనల్ కాన్ఫిడెన్షియల్ సర్వేలో పేర్కొన్నట్లు తెలిసింది. 75 ఏళ్ళ చరిత్రలో తొలిసారి ఆదిలాబాద్ ఎంపీగా ఓ మహిళ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. ఇక గతంలో ప్రముఖ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఆర్టీవి స్టడీ రిపోర్టులో కూడా ఆత్రం సుగుణ గెలవబోతున్నదని ప్రకటించింది. టుడే చాణక్య, ఇన్ సైట్, పబ్లిక్ ఓట్ పల్స్, మనంటీవీ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేలలో ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ మొగ్గును చూపాయి. మంత్రి సీతక్క వ్యూహాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్, కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేరుస్తున్నాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్ధి మార్పు కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.
