హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఉమ్మడి పౌరస్మృతి (UCC)ని వ్యతిరేకించే వారిని, ‘ఓట్ జీహాద్’ గురించి మాట్లేడేవారిని, 370వ అధికరణ, ట్రిపుల్ తలాక్ మద్దతుదారులను లోక్‌సభ ఎన్నికల్లో లో చిత్తుగా ఓడించాలని, బుజ్జగింపు రాజకీయాలకు, అవినీతికి చరమగీతం పాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని నిజాం గ్రౌండ్స్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, రాష్ట్రంలో రాబోయే ఫలితాలపై కూడా యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని అన్నారు.
అవినీతికి పాల్పడే పార్టీలు, యువత ఆకాంక్షలను అణగ దొక్కేవారు, మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేయలేరని వారు భారతదేశ భవిష్యత్తును ఎప్పటికీ నిర్మించలేరని విపక్షాలను ఉద్దేశించి మోదీ విమర్శించారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించుకుంటూ దేశం ఈరోజు ముందుకు దూసుకుపోతోందని, భారతదేశం డిజిటల్ పవర్‌గా, ఫిన్‌టెక్ ఫవర్‌గా నిలిచిందని, ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచిందని చెప్పారు. చెప్పారు.