AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం ( మే10) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టడంతో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. దీంతో లీగ్ రౌండ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలతో 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై గుజరాత్ జట్టు బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై తరఫున డారిల్ మిచెల్ 63 పరుగులు, మొయిన్ అలీ 56 పరుగులు చేశారు. నాల్గో వికెట్‌కు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల మధ్య 109 పరుగుల భాగస్వామ్యం ఉంది, కానీ మిచెల్ ఔట్ తర్వాత, చెన్నై ఇన్నింగ్స్ మరోసారి తడబడింది. దీనికి తోడు భారీ స్కోరు కావడంతో చెన్నైకు పరాజయం తప్పలేదు. గుజరాత్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ 3, రషీద్‌ ఖాన్‌ 2, ఉమేశ్‌, సందీప్‌ వారియర్‌ చెరో వికెట్ తీశారు.

ANN TOP 10