AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హోటల్‌ బాత్‌రూమ్‌లో ఇద్దరు వ్యక్తులతో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న డాక్టర్‌ భర్త

లక్నో: హోటల్‌ బాత్‌రూమ్‌లో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఉన్న భార్యను డాక్టర్‌ అయిన ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తన బంధువులతో కలిసి వారిని కొట్టాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ వైద్యులైన భార్యాభర్తలు విభేదాల కారణంగా విడిగా నివసిస్తున్నారు. అయితే ఇద్దరు ప్రియులతో కలిసి భార్య హోటల్‌ రూమ్‌లో ఉన్న విషయం ఆమె భర్తకు తెలిసింది. దీంతో తన బంధువులతో కలిసి అతడు అక్కడకు వెళ్లాడు. బలవంతంగా హోటల్‌ గదిలోకి ప్రవేశించాడు. అతడ్ని చూసి బాత్‌రూమ్‌లో దాక్కున్న భార్య, ఇద్దరు వ్యక్తులను బంధువులతో కలిసి కొట్టాడు.

కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. మహిళ భర్త, ఆయన ఇద్దరు బంధువులు, ఆమె ఇద్దరు ప్రియులను అరెస్ట్‌ చేశారు. అయితే ఆ మహిళను మాత్రం పోలీసులు వదిలేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హోటల్‌ బాత్‌రూమ్‌లో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఉన్న భార్యను డాక్టర్‌ భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కొట్టిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ANN TOP 10