AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో దారుణం.. ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై..

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగానికని వచ్చిన యువతిపై ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన అమీర్‌పేట్‌లో చోటు చేసుకుంది. జాబ్ ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఇంటర్వ్యూ కు వచ్చిన యువతిని సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్.. సెలెక్ట్ అయ్యావని చెప్పింది. దీంతో ఆఫీసు సిమ్ కార్డ్ ఇచ్చే సాకుతో సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్ ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి వచ్చిన యువతిపై కామాంధుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. నిందితుడు నవీన్ కుమార్‌ను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు.

ANN TOP 10