ప్రయాణికులతో మాటా ముచ్చట
ఆరు గ్యారంటీలపై వాకబు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఉన్న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం స్టేడియం నుంచి బటయకు వచ్చిన ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అటుగా వెళ్తున్న బస్సు ఎక్కారు.
మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం గురించి వాకబుచేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి వివరించారు. కాంగ్రెస్ న్యాయ్ ప్రచార పత్రాలను వారికి అందించారు.









