AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నవనీత్‌కౌర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. ఏమన్నారంటే..

తెలంగాణలో బీజేపీ వస్తే మతకల్లోలాలు వస్తాయి.. బీజేపీ ఇతర మతాలను కించపరుస్తోంది, దాడులు చేస్తోంది.. అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో శాంతిభద్రతలను దెబ్బతీయాలని చూస్తున్నారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. 370 ఆర్టికల్ రద్దుపై లోక్‌సభలో మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని.. సభలో చర్చ జరగకుండానే ఆర్టికల్ 370ని రద్దు చేశారంటూ పేర్కొన్నారు. నవనీత్‌కౌర్‌ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్.. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోందన్నారు. 15 నిమిషాల్లో లేపేస్తామని నవనీత్‌ కౌర్‌ అంటున్నారు.. నవనీత్‌ కౌర్ వ్యాఖ్యలు మతకల్లోలాలకు దారితీస్తాయి.. నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.. ఇక్కడున్న మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈసీ కూడా సుమోటోగా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్‌.

మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తే కాల్చి చంపేశారంటూ పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి రాముడు గుర్తొస్తాడు.. దేవుడిని విశ్వసిస్తున్నా.. అందుకే ఒట్లు వేస్తున్నా.. అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం బీజేపీ దేవుడిని వాడుకుంటోంది.. రెచ్చగొట్టాలని చూస్తోంది.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ANN TOP 10