AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్టీఆర్‌భవన్‌లో కీలక సమావేశం..

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశంపార్టీ (TTDP) దూకుడు పెంచింది. గురువారం ఎన్టీఆర్‌భవన్‌ (NTR Bhavan)లో రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneswar) ఆధ్వర్యంలో కీలక సమావేశం (key Meeting) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీపీ ముఖ్యనేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి (Ravula Chandrasekhar Reddy), బక్కిన నరసింహులు (Bakkina Narasimhulu)తో సహా.. హైదరాబాద్ సిటీ నాయకులు (Hyderabad City Leaders) హాజరయ్యారు. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ సభ ఈనెల‌ 29న తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో జరగనుంది. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ (Exhibition Grounds)లో సభ నిర్వహించాలని టీటీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధి‌నేత చంద్రబాబు (Chandrababu) హాజరవుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana)కు చెందిన తెలుగుదేశం నాయకులు, ప్రతినిధులు ఈ సభకు వస్తున్నారు. తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించారు.

ANN TOP 10