AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేపర్‌ లీకేజీ రాజద్రోహమే..

రాష్ట్రపతి పాలన అమలు చేయాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై విపక్షాల విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ అసమర్థతే కారణమని.. పాలకుల కుటుంబ సభ్యుల పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేపర్‌ లేకేజీపై కేసీఆర్‌ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులంతా నిందితులేనని ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ రాజ ద్రోహమే అని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కనీస పరిజ్ఞానం లేని ఆరుగురికి 120 మార్కులు రావడం జరిగిందని వీరందరి కాల్‌ డేటా తో పాటు బోర్డు సభ్యులకు కాల్‌ డేటాను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

ANN TOP 10