AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అక్కడ ప్రతి పురుషుడికీ ఇద్దరు భార్యలు తప్పనిసరి..

చేసుకోము అంటే గ్రామ బహిష్కరణ..!
మన దేశంలో ఎన్నో రకాల ఆచారాలను ప్రాంతాల బట్టి పాటిస్తుంటారు. అటువంటి ఓ వింత ఆచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓ గ్రామంలో పురుషులు తప్పకుండా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. దీనికి ఎలాంటి అడ్డూ ఉండదు. తమ భార్య కూడా సంతోషంగా సవతిని అంగీకరిస్తుంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

భారతదేశంలోని ఓ గ్రామంలో పురుషులు తప్పకుండా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. చాలా కాలంగా ఈ సాంప్రదాయం ఆ గ్రామంలో కొనసాగుతుంది. అక్కడ ఉన్న మహిళలు కూడా తన భర్త రెండో పెళ్లి చేసుకోడానికి అడ్డు చెప్పురు… దీని వెనుక గల కారణం తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. అలాంటి కోవలోకే వస్తుంది ఈ గ్రామం కూడా. ఎన్నో ఆసక్తికరమైన కథలు, ఎన్నో ఆశ్చర్యకరమైన కథలు ఇక్కడ దాగి ఉన్నాయి. అనేక అలవాట్లు మనుషులను ఆలోచింపజేస్తాయి. ఇక్కడ అలాంటి గ్రామం గురించి తెలుసుకోవడం మొదటి ఆశ్చర్యంగా అనిపించవచ్చు… అయితే ఇది నిజం.

మనం ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామం భారత్ -పాకిస్థాన్ సరిహద్దులోని ఉంది. ఇది రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలోని గ్రామం. స్థానిక ఆచారం ప్రకారం ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండాలి.. అలా కాదు నేను శ్రీరామ చంద్రుడిని.. నాకు ఒకరే భార్య చాలు అంటే ఊరి నుంచి వెళ్లగొడతారు. ఈ చిన్న గ్రామం పేరు తెరాసర్. ఇక్కడ సుమారు 600 మంది నివసిస్తున్నారు. ప్రతి పురుషుడికి కనీసం ఇద్దరు భార్యలు ఉంటారు. ఇది ఎంత వింతగా అనిపించినా, ఈ ఆచారం వెనుక ఉన్న కారణం మరింత ఆశ్చర్యపరుస్తుంది.

మొదటి భార్య పిల్లలు పుట్టరని ఈ థెరసర్ గ్రామ నివాసితులు నమ్ముతారు. సంతానం కావాలంటే రెండో పెళ్లి చేసుకోవాలి. ఈ వింత నమ్మకం కారణంగా, ఈ గ్రామంలోని పురుషులు వారి మొదటి వివాహం తర్వాత రెండవ వివాహం చేసుకోవాలి.

దీని వెనుక ఓ కథ ఉందని అంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం, ఈ గ్రామంలో ఒక వ్యక్తికి సంతానం లేదు. తరువాత అతను తన రెండవ వివాహం నుండి ఒక బిడ్డ కలిగింది.. ఆ తర్వాత ఆ గ్రామంలో చాలా మందికి ఇలాంటి ఘటనే ఎదురైంది. అప్పటి నుంచి గ్రామంలో రెండో పెళ్లి ఆచారం మొదలైందని చెబుతున్నారు.

ANN TOP 10