ఖమ్మం ప్రజలు ప్రారంభించిన పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని, పోరాటల గడ్డగా ఖమ్మం జిల్లాకు పేరుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డి మద్దతుగా కొత్తగూడెంలో జరిగిన జన జాతర బహిరంగ సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నక్కజిత్తుల కేసీఆర్ వైఖరిని ఖమ్మం జిల్లా ప్రజలు ముందే పసిగట్టారని విమర్శించారు. అందుకే 2014, 2019, 2023 ఆ పార్టీని దూరం పెట్టారని చెప్పారు. రాబోయే మార్పులు, జరగబోయే పరిణామాలను ఖమ్మం ప్రజలు ఊహిస్తారని అన్నారు. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరుతారని కేసీఆర్‌ను అడుగుతున్నారన్నారు. కేసీఆర్ బీజేపీలో చేరుతారని ముందు నుంచే చెబుతున్నామని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు.
కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. నమ్మి మోసం చేయడంలో కేసీఆర్‌ను మించిన వ్యక్తి మరోకరు లేరన్నారు. అలాగే డిసెంబర్ 3న వచ్చినవి సెమీ ఫైనల్ ఫలితాలు మాత్రమేనని, ఈ నెల 13 న జరిగే ఫైనల్స్ లోనూ విజయం మాదేనని ధీమాను వ్యక్తం చేశారు. గుజరాత్‌ను ఓడిద్దాం.. తెలంగాణను గెలిపించుకుందామని పిలుపినిచ్చారు. పదేళ్ల పాటు తెలంగాణకు ద్రోహిం చేసింది బీజేపీయే అని అన్నారు. ఈ పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పదేళ్లలో రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిన బీజేపీకి ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖయామని ఫైర్ అయ్యారు. 7 లక్షల అప్పుతో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం తమ చేతిలో పెట్టిందన్నారు. భట్టి విక్రమార్క గట్టి వ్యక్తి కాబట్టి నిధులు సర్దుకున్నామని చెప్పారు. అన్ని వర్గాల ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని గుర్తు చేశారు. రైతు భరోసా అగిపోయిందని దుష్ర్పచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ ఏమీ తప్పుగా మట్లాడలే: భట్టి
రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమీ తప్పుగా మాట్లాడలేదని, తప్పుడు కేసులు పెట్టి ఢిల్లీకి పిలుస్తారా.. మేము భయపడమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొత్తగూడెం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రజాసేవలో ఉన్నారని చెప్పారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతో ఖమ్మం జిల్లా సమస్యలను పరిష్కారించుకుందామని తెలిపారు. మీరు వేసే ఓటు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సాయం చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. సింగారేణిని పదేళ్లలుగా గత ప్రభుత్వం దోచుకుందని విమర్శించారు. పదేళ్లుగా సింగారేణి సంస్థను, కార్మికులను అనేక ఇబ్బందులు పెట్టారని, కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలు అడ్డుకున్నారని మండిపడ్డిరు. సింగరేణి బొగ్గు బావులను రక్షిస్తామని, మూసేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.









