AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

66 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెలవరీలు

మంత్రి హరీశ్‎రావు
సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో(Govt General Hospital) లాప్రోస్కోపి ఎక్విప్‎మెంట్‎ను(Laparoscopy Equipment) జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్(Prashanth Jeevan Patil), జెడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి మంత్రి హరీశ్‎రావు(Minister Harish Rao) ప్రారంభించారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడుతూ..‘‘రూ. 70 లక్షల విలువైన పరికరాలను సిద్దిపేట(Siddipet), గజ్వేల్ (Gajwel), ఆసుపత్రికి ఈసీఐఎల్ (ecil) కంపెనీ బృందం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. సర్జరీ చేయడానికి లాప్రోస్కోపి చాలా ఉపయోగపడుతుంది. జనరల్ సర్జరీ డిపార్ట్‎మెంట్‎కి(Department of General Surgery) ఈ పరికరాలు అందిస్తున్నాం. దీన్ని ప్రజలకు సేవలు అందించేందుకు వాడాలి. నార్మల్ డెలివరీల సంఖ్య పెంచేందుకు వ్యాక్యుం అసిస్టేడ్ డేవిసేస్(Assisted Devises) దోహదం చేస్తుంది. 99.9శాతం డెలివరీలలో(Deliveries) 66 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 33శాతం ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీలు జరుగుతున్నాయి. సురభి మెడికల్ కళాశాలలో వారం రోజుల ముందే సర్జరీలు చేస్తూ డెలివరీ చేయడం సరికాదు. ఐరన్ ట్యాబ్ లెట్స్ పేషంట్స్ సరిగ్గా వాడడం లేదు. వాటిపై దృష్టి సారించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆస్పత్రుల్లో ఇన్‎ఫెక్షన్(Infection) సోకకుండా చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నాక..పేషెంట్‎లతో సెక్యూరిటీ గార్డు నుండి వైద్యుల వరకు నవ్వుతూ పలకరిస్తూ చికిత్స అందించాలని’’ హరీశ్ సూచించారు.

ANN TOP 10