AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్ణాటక సీఎంకు రాహుల్ గాంధీ లేఖ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ మనవడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియోల కుంభకోణం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. దాదాపు 3 వేల సెక్స్ వీడియోలు వెలుగులోకి రావడం ఎన్నికల వేళ కన్నడ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలోనే నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ప్రజ్వల్ రేవణ్ణ బాధితులకు సాయం అందించాలని రాహుల్ కోరారు. ఇక రేవణ్ణకు ఇప్పటికే అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా ఆయనపై కిడ్నాప్, అత్యాచారం కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆయన నివాసానికి చేరుకున్న సిటి అధికారులు.. ఫోన్ సీజ్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు రేవణ్ణ బాధితుల నుంచి కొత్త ఫిర్యాదు అందడం హాట్ టాపిక్‌గా మారుతోంది.

ANN TOP 10