శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం పెద్ద ఎత్తున బంగారంతో పాటు వెండి ఆభరణాలు పట్టుపడ్డాయి. ముంబై నుంచి హైదరాబాద్కు తరలించేందుకు యత్నించిన ఏడుగురు నిందితులను ఎలక్షన్ స్క్వాడ్, ఆర్జీఐఏ పోలీసులు తనిఖీ చేసి 35కిలోల బంగారం 40 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పట్టుబడిన బంగారం, వెండి నగలకు సంబంధించి పూర్తిస్థాయిలో రశీదులు లేవు. కొన్ని ఆభరణాలకు మాత్రమే ఉండటంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల ప్రత్యేకాధికారుల వద్దకు సీజ్ చేసిన బంగారం, వెండి పంపినట్లు ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.









