AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇక పట్టభద్రుల పోరు.. ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌:):
వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 5న ఓట్లు లెక్కించనున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయింది. కాగా, ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. అభ్యర్థులు నల్లగొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను ఆ పార్టీ ఖరారు చేసింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరనేది తేలాల్సి ఉంది.

ANN TOP 10