AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అభివృద్ధి చేయకుండా.. అక్షింతల పేరుతో రాజకీయమా!

ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు కురిపించారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం 5 నెరవేర్చామన్నారు. బీజేపీ నాయకులు ప్రజల ఖాతాలో లక్ష రూపాయలు వేస్తామన్నారని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, కానీ ఏది చేయలేదన్నారు. అభివృద్ధి చేయకుండా అక్షింతల పేరుతో రాజకీయం చేస్తుందని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్‌లో తాను చేసిన అభివృద్ధి తప్ప వినోద్ బండి చేసిందేమీ లేదన్నారు. బండి సంజయ్ నాయన టీచర్ అంటున్నాడని, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేశాడని చెబుతున్నాడని వ్యంగాస్త్రం వేశారు.

ఆగస్టు 15 లోపు 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని, వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్‌లో నలుగురు ఎమ్మెల్యేలు వెలిశాల రాజేందర్ రావుతో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పేపర్ 1 ప్రణవ్ ఫెయిల్ అయ్యాడు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పేపర్ 2 ఎంపీ అభ్యర్థి పాస్ కావాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రావద్దని కోరుకుంటున్నానని, ఐదేళ్లు ఎవరైనా అధికారంలో ఉండాలన్నారు. దేశమంతా అంబేద్కర్ విగ్రహాలను తీసేసి ఎస్సీ, ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆలోచనలో బీజేపీ ఉందని వ్యాఖ్యానించారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావును ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

ANN TOP 10