AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అయోధ్యను దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ.. ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి

అయోధ్యలో కొలువైన బాలరాముడిని దర్శించుకునేందుకు బుధవారం (మే 1 వ తేదీన) రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి అయోధ్య పర్యటన నేపథ్యంలో అయోధ్య రామ మందిర అర్చకులు, అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ద్రౌపది ముర్మూ పర్యటన సందర్భంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. భక్తులకు యధావిధిగా బాలరాముడి దర్శనాలు కొనసాగుతాయని వెల్లడించారు.

అయోధ్య బాల రాముడిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్మూ.. హనుమాన్‌ గర్హి ఆలయంలో హనుమాన్‌ను దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సరయూ పూజ, హారతి కార్యక్రమాన్ని రాష్ట్రపతి నిర్వహించనున్నారు. రాష్ట్రపతి అయోధ్య రామ మందిర పర్యటన కారణంగా భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటికే బాలరాముడి దర్శనానికి టికెట్‌లు బుక్‌ చేసుకున్న భక్తులు అదే సమయంలో టైమ్‌లో దర్శనం చేసుకోవచ్చని వెల్లడించారు.

ANN TOP 10