(అమ్మన్యూస్, హైదరాబాద్):
ధరూర్ లో రంజిత్ రెడ్డి రోడ్ షో దద్దరిల్లింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గం అంబేడ్కర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తను ఉద్దేశించి ఇరువురు ప్రసంగించారు.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా ఇంటింట ప్రచారం చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరయ్య అని ఆయన చెప్పారు. మహిళల సంక్షేమం కోసం రాబోయే రోజులలో కాంగ్రెస్ పెద్ద పార్టీ పీట వేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి నన్ను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో టీపీపీసీసీ జనరల్ సెక్రెటరీ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.









