AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభ ఎన్నికల తరువాత తెలంగాణలో అద్భుతం జరుగబోతోంది : తమిళిసై

తెలంగాణ గవర్నర్‌గా రాజీనామా చేసిన తమిళిసై .. మొదటిసారి హైదరాబాద్ వచ్చారు. బీజేపీ తరపున తెలంగాణలో 10 రోజుల పాటు బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు తమిళి సై. హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు, నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రచారానికి రావడం, ప్రజలని మరోసారి కలవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో ప్రచారం చేస్తాను.. మెజార్టీ సీట్లు గెలుస్తామని స్పష్టంచేశారు. ఫలితాల తర్వాత తెలంగాణలో అద్భుతం జరగబోతుందని అన్నారు తమిళిసై. తెలంగాణ నుంచి వీలైనంత ఎక్కువ మంది కేంద్రమంత్రులు అవుతారని చెప్పారు

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన రిజర్వేషన్ల రగడపై స్పందించారు తమిళిసై. రిజర్వేషన్లు తీసేసే ప్రసక్తే లేదన్నారు. రిజర్వేషన్లపై కేంద్రం క్లారిటీతో ఉందన్న తమిళిసై.. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి ఎమర్జెన్సీ విధించింది ఎవరి పాలనలో అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ కాలంలో తాను కూడా బాధితురాలినేనన్నారు. ఎమర్జెన్సీ విధించిన పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్న తమిళిసై.. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు.

కాగా చెన్నై (దక్షిణ) లోక్‌సభ నియోజకవర్గం నుండి BJP అభ్యర్థిగా తమిళిసై పోటీ చేశారు. తమిళనాడులో పోలింగ్ ముగియడంతో ఆమె తెలంగాణలో ప్రచారానికి వచ్చారు.

ANN TOP 10