తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తన పేరు, ఫోటోను ఉపయోగించి కొంతమంది మోసగాళ్లు పలువురుకి ఫేక్ కాల్స్ చేస్తున్నారని.. ఐఏఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. +977-984-4013103 ఫోన్ నెంబర్ తో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కొందరికి కాల్స్ చేస్తున్నారని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరీ (టీఎస్‌సీఎస్‌బి) కి ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేక్ కాల్స్ చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీఎస్ శాంతికుమారి కోరారు. ఎఫ్ఐఆర్ నెం. 4/2024 తేదీ 28-04-2024 కింద కేసు బుక్ చేశారు. కేసు నమోదు చేసుకున్న టీఎస్‌సీఎస్‌బి ఫేక్ కాల్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.









