AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట.. ఇవాళ నడ్డా రాక..

సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు తమదైన శైలిలో ప్రచారానికి రెడీ అయ్యారు. నేడు JP నడ్డా రేపు మోదీ, ఎల్లుండి అమిత్‌ షా ఇలా బీజేపీ అగ్రనేతల అంతా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇవాళ తెలంగాణలో రానున్న నడ్డా ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం పన్నెండున్నరకి మహబూబాబాద్‌ బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం 5 గంటలకు నిజాంపేటలో రోడ్‌షో నిర్వహిస్తారు. రేపు ప్రధాని ఎల్లుండి అమిత్‌షా తెలంగాణ రానుండగా.. మిషన్‌ 400 ప్లస్‌ లక్ష్యంగా బీజేపీ ప్రచారం చేస్తోంది.

ANN TOP 10