AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి చేరిక‌ల వెల్లువ త‌లెత్తింది. అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి నేతృత్వం లో ప్ర‌తీరోజు చేరికలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ప‌ట్ట‌ణంలోని ప్ర‌జాసేవా భ‌వ‌న్ క్యాంపు కార్యాల‌యం త‌ర‌లివ‌స్తున్న ప్ర‌జ‌లు ,అభిమానుల తో సంద‌డి మారుతోంది. ప‌ట్ట‌ణంలోని వివిధ వార్డుల నుండి పెద్దసంఖ్య‌లో కాంగ్రెస్‌లో చేర‌గా వారంద‌రికీ కంది శ్రీ‌నివాస‌రెడ్డి కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు. రానున్న పార్ల‌మెంట్‌తోపాటు స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించేందుకు అంద‌రూ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

7, 42, 46 వ వార్డుల నుండి చేరిక‌లు

పట్టణంలోని వార్డు నెంబర్ 42 రిక్షా కాలనీవాసులు ఎం.ఏ ఖయ్యూం ఆధ్వర్యంలో కంది శ్రీనివాస‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అలాగే వార్డు నెంబర్ 7 కేఆర్కే కాలనీ నుండి స్థానిక కౌన్సిలర్ ఆనంద్ ఆధ్వర్యంలో బిజెపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వాగ్మారే రాజ్, ఎం.డి ముస్తాక్, మన్సూర్, జావీద్, అన్వర్ హ‌స్తం తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కండువాలు కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే వార్డు నెంబర్ 46 బ్రాహ్మణ్ వాడ బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు జోగు సంతోష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి -వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, కౌన్సిల‌ర్లు ద‌ర్శ‌నాల ల‌క్ష్మ‌ణ్‌, క‌లాల శ్రీ‌నివాస్‌, ఆవుల వెంక‌న్న‌, సాయి ప్రణయ్, జాఫర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, బాయిన్‌వార్ గంగారెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, శ్రీలేఖ, యాల్ల పోతా రెడ్డి, ఆవుల వెంకన్న, నాయకులు పోరెడ్డి కిషన్, బండి దేవిదాస్ చారి, తమ్మలవార్‌ చందు, లింగన్న, దయాకర్, నవీన్, మల్లయ్య, కుర్ర నరేష్, సయ్యద్ షాహిద్ అలీ, ఇర్ఫాన్ ఖాన్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ లో చేరిన బేల ,జైన‌థ్ మండ‌ల వాసులు

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌తీ రోజు జ‌రుగుతున్న చేరిక‌ల‌లో భాగంగా రాత్రి జిల్లాలోని బేల‌, జైన‌థ్ మండలాల నుండి ప్ర‌జ‌లు అభిమానులు పెద్ద ఎత్తున ప్ర‌జాసేవాభ‌న్ కు త‌ర‌లివ‌చ్చారు. బేల మండలం టాక్లి , జైనథ్ మండలం జామిని గ్రామస్థులు కంది శ్రీనివాస రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారందరికి కండువాలు కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో బేల మండల అధ్యక్షులు ఫైజల్లా ఖాన్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,కౌన్సిలర్ కలాల శ్రీనివాస్,మాజీ జడ్పీటీసీలు రాందాస్ నాక్లే,కొండ గంగాధర్,కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు మంచికట్ల ఆశమ్మ,విలాస్ పటేల్, లోక ప్రవీణ్ రెడ్డి,దర్శనాల అశోక్, ఖయ్యుమ్,నిమ్మల ప్రభాకర్,తమ్మల చందు,నవీన్, అవినాష్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

నేడు 32 వ వార్డు నుండి చేరిక‌లు

ఆదిలాబాద్ పట్టణం 32 వ వార్డులోని బొక్కల్ గూడ కాలనీ నుండి మైనారిటీ నాయకులు షాకీర్,ఖయ్యుమ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్య‌లో బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీలకు చెందిన కాల‌నీవాసులు కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ కు త‌ర‌లివ‌చ్చారు. కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి కండువాలు కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్,జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, శ్రీ లేఖ,పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,కౌన్సిలర్లు సాయి ప్రణయ్,జాఫర్ అహ్మద్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,లోక ప్రవీణ్ రెడ్డి,బాయిన్ వార్ గంగా రెడ్డి,డేరా కృష్ణ రెడ్డి,తమ్మల చందు,ఖయ్యుమ్,మొహమ్మద్ రఫీక్, అతిక్ ఉర్ రెహమాన్,సాహిద్ ఖాన్, మహేందర్,మంగేష్, చారి,అఖిమ్, అంజద్ ఖాన్, అతిక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆత్రం సుగుణ గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి-కంది

ప్ర‌తి ఒక్క నాయ‌కుడు, కార్య‌క‌ర్త క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి ముమ్మ‌ర ప్ర‌చారం చేయాల‌ని, ముఖ్యంగా వార్డు ఇన్‌చార్జీలు ఆ బాధ్య‌త‌ను భుజానికేసుకోవాల‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ ఆరు గ్యారంటీల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసేలా ఓట‌ర్ల‌ను చైత‌న్య ప‌ర్చాల‌న్నారు. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీ తీసుకురావాల‌ని, అదే మ‌న భ‌విష్య‌త్తుకు గీటురాయి అంటూ దిశా నిర్దేశం చేశారు. చాలా మంది స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు చేర‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని, వారంద‌రినీ సాద‌రంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీని మ‌రింత బలోపేతం చేయాల‌ని పిలుపునిచ్చారు. రానున్న పార్ల‌మెంట్‌తోపాటు స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించేందుకు అంద‌రూ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయాల‌ని ఆయ‌న సూచించారు.

రేవంత్ , రాహుల్ స‌భ‌ల‌ను జ‌య‌ప్ర‌దం చేయాలి

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా లోక్ స‌భ ప‌రిధిలోని ఆసిఫాబాద్ జిల్లా కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త్వ‌ర‌లో రానున్నార‌ని నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు ఆ స‌భ‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌ని పిలుపునిచ్చారు. అలాగే మే 5న ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ నిర్మ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న ఉండే అవ‌కాశ‌ముంద‌ని అతి త్వ‌ర‌లో షెడ్యూల్ రావ‌చ్చ‌ని ఆ స‌భ‌ను పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వెళ్లి విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న శ్రేణుల‌కు దిశానిర్దేశం చేసారు.

ANN TOP 10