పదేళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందని మంత్రి సీతక్క ప్రశ్నించారు. అభివృద్ధి అడిగితే అయోధ్య ను చూపిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చి మూడు నెలల్లో 34 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఆదివారం ములుగు జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ పెంచి ఆఖరికి బట్ట కట్టుకొని పరిస్థితి తెచ్చిందని విమర్శించారు. చీరల మీద సైతం జీఎస్టీ వేశారని మండిపడ్డారు. ఉద్యోగం అడిగితే దేవుడిని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీని చంపిన గాడ్సే మీ నాయకుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సే అంటే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అని హాట్ కామెంట్స్ చేశారు.
50 ఏళ్ల నుంచి తిరంగా జెండా ఎగరనీయలే అన్నారు. బ్రిటిష్ వాడు ఎలా జెండా పట్టుకుంటే చంపేశాడని ప్రశ్నించారు. బీజేపీ సైతం జెండా ఎగర నియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు ప్రధానులు చేసిన కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ కుటుంబానికి సొంత ఇల్లె లేదని గుర్తు చేశారు. మోడీ సూట్ 16 లక్షలు అవుతాయని, మేకప్‌కే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందన్నారు. బీజేపీ రాజ్యాంగం మారుస్తాం అంటున్నారని, అలా అయితే మన హక్కులు పోతాయని, రిజర్వేషన్లు పోతాయని సీతక్క గుర్తు చేశారు. ఇటువంటి పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సీతక్క పిలుపు ఇచ్చారు.









