AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘భళారా బాలకా’.. సాయి చరణ్‌ను సన్మానించిన సీఎం రేవంత్

రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు కార్మికుల ప్రాణాలు కాపాడిన సాయి చరణ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆరుగురు కార్మికుల ప్రాణాలు కాపాడాడు. ఈ క్రమంలోనే ఆదివారం తల్లిదండ్రులతో కలిసి సాయిచరణ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కార్మికులను కాపాడటంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. బాలుడి ధైర్య సాహసాలకు ముగ్ధుడైన సీఎం పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఇక 15 ఏళ్ల సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామలో నివాసం ఉంటున్నాడు.

ANN TOP 10