AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెలరేగిన సుదర్శన్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్!

ఐపీఎల్‌లో భాగంగా నేడు బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ భారీ టార్గెట్ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. జీటీని బ్యాటింగ్‌కు ఆహ్వనించింది. గుజరాత్ జట్టు ఓపెనర్లు పెద్దగా రాణించకపోయినా ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 5 పరుగులకే వెనుదిరిగాడు. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో వికెట్ కొల్పోయాడు. అటు మరో ఓపెనర్‌, కెప్టెన్ శుభమాన్ గిల్ కూడా నిరాశ పరిచాడు. గిల్ 16 పరుగులు చేసి మైదానాన్ని విడిచాడు. వీరిద్దరి వెనువెంటనే ఔట్ అయిన తర్వాత సాయి సుదర్శన్, షారుక్ ఖాన్‌లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫారుక్ ఖాన్ 30 బంతుల్లో 5 సిక్సులు, 3 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. అటు సాయి సుదర్శన్ ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తించాడు. సుదర్శన్ 49 బంతుల్లో 4 సిక్సులు, 8 ఫోర్లతో 84 పరుగులు రాణించాడు. దీంతో గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగుల టార్గెట్ ఆర్సీబీ ముందు పెట్టింది.

ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. 201 భారీ లక్ష్య చేదనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బరిలోకి రానుంది.
గుజరాత్ టైటాన్స్ జట్టు: వృద్ధిమాన్ సాహా (వీకే), శుభమాన్ గిల్ (సి), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (సి), విల్ జాక్స్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వీకే), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

ANN TOP 10