AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేవెగౌడ మనువడి నకిలీ పోర్న్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు

బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కు చేదు అనుభవం ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో రేవణ్ణను సంబంధించినట్టు చెబుతున్న ఒక అశ్లీల వీడియో పోస్ట్ కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) పొత్తుతో ఈసారి లోక్‌సభ ఎన్నికలకు వెళ్తుండటం, మూడో దశ ఎన్నికలకు ముందు ఈ వీడియో సర్య్యులేట్ కావడం సంచలనమైంది. తన ప్రతిష్టను భంగపరిచి, ఓటర్ల మనసుల్లో విషబీజాలు నాటేందుకు నకిలీ వీడియోను పోస్ట్ చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రేవణ్ణ పేర్కొన్నారు. నకిలీ సెక్స్ వీడియో స్కాండిల్‌పై ప్రత్యేక విచారణ బృందానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించిన మరుసటి రోజే పోలీసులకు రేవణ్ణ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రజ్వల్ అశ్లీల వీడియో కేసుపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం రాత్రి సామాజిక మాధ్యమంలో ‘ఎక్స్’లో తెలిపారు. ఒక మహిళపై లైంగిక దాడి జరిగినట్టు కనిపిస్తున్న వీడియో ఒకటి హసన్ జిల్లాలో సర్క్యులేట్ అవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. దీనిపై ‘సిట్’తో దర్యాప్తు జరిపించాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారని, దీని ఆధారంగా ప్రత్యేక టీమ్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. కాగా, రేవణ్ణ శనివారం ఉదయం జర్మనీ బయలుదేరి వెళ్లారు.

ANN TOP 10