భుక్తాపూర్ లో కాంగ్రెస్ శ్రేణుల సందడి
ఆత్రం సుగుణ ను గెలిపించాలని అభ్యర్ధన
ఇంటింటికి వెళ్లి ఓట్లడిగిన నాయకులు
స్టిక్కర్లు అతికిస్తూ కరపత్రాల పంపిణీ
అమ్మన్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకు వెళ్తోంది. నియోజక వర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ నాయకులు , కార్యకర్తలు ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని 44,45 వ వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు.కరపత్రాలు పంచుతూ ,స్టిక్కర్లు అతికిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. కాలనీల్లో కంది శ్రీనివాస రెడ్డి కుట్టు మిషన్ తొక్కి , వాటర్ ప్లాంట్ శుభ్రం చేసి ,టీస్టాల్లో ఛాయ్ పోస్తూ ఓటర్లను ఆకర్షించారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అందుకే చేతి గుర్తు కే ఓటు వేసి ఎంపీ గా ఆత్రం సుగుణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్,కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాయిన్ వార్ గంగా రెడ్డి,లోక ప్రవీణ్ రెడ్డి,కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్,రషీద్ ఉల్ హాక్,పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,కాలనీ వాసులు సయ్యద్ షాహిద్ అలీ,అంజద్ ఖాన్,ప్రేమిల,అరుణ్,నాయకులు యాల్ల పోతా రెడ్డి,తమ్మల చందు,ఖయ్యుమ్, నిమ్మల ప్రభాకట్ దయాకర్,తదితరులు పాల్గొన్నారు.









