AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

అసెంబ్లీ ఎన్నికల వేల రిజర్వేషన్లపై అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రోజు రోజుకీ మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్లను సంఘ్ మొదటి నుంచి సమర్థిస్తోందని, అయితే కొందరు తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీఆర్‌ఎస్‌, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు కూడా. ఇక స్వార్థంతో ఆర్ఎస్ఎస్పై మాట్లాడుతున్నారని, ఇదంతా దుష్ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు. వివాదం సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవం అని ఎవరికోసం అయితే రిజర్వేషన్లు కేటాయించబడ్డాయో వారు అభివృద్ధి చెందే వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని మోహన్ భగవత్ సింగ్ చెప్పారు.

ANN TOP 10