నేడు సమంత పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో విషెస్ మార్మోగిపోతున్నాయి. ఈ క్రమంలో సమంత అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. నిర్మాతగా మారి మొదటి చిత్రాన్ని ప్రకటించింది. తన నిర్మాణ సంస్థలో సమంతనే హీరోయిన్గా ఫస్ట్ సినిమా చేస్తోంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ జత చేసింది. ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్‌తో మూవీ రాబోతున్నట్లు వెల్లడిరచింది.
ఇందులో సమంత రెడ్ కలర్ చీర కట్టుకొని, మెడలో తాళిబొట్టు వేసుకుని గాజులు, బొట్టు పెట్టుకుని తుపాకీ చేతిలో పట్టుకుని కోపంగా చూస్తూ షాకింగ్ లుక్‌లో కనిపించింది. దీనికి ‘‘ బంగారుమయం కావాలంటే అన్నీ మెరవాల్సిన అవసరం లేదు’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.









