AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పబ్‌లో మందుబాబుల వీరంగం..

హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో మద్యం మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. ఫిలింనగర్‌లోని మూన్‌షైన్‌ పబ్‌లో (Moonshine Pub) పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. యువతితో డ్యాన్స్‌ చేస్తున్న యువకుడిని అడ్డుకుని.. ఆమెతో తాము చేసేందుకు యత్నించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. దీంతో ముగ్గురు గాయపడ్డారు.

తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి తమను గాయపర్చారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.

ANN TOP 10