AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విషాదం.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని విషం తాగిన ప్రేమికులు

ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న ఆవేదనతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో శనివారం రాత్రి జరిగింది. ఇద్దరిదీ వేర్వేరు కులం కావడంతో పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు. కులం తమ ప్రేమకు అడ్డుగా నిలిచిందని ఆవేదనకు గురైన ఆ ఇద్దరూ.. పురుగుల మందు తాగి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు.

తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో జీవితంలో ఇక కలిసుండటం కుదరదని భావించిన ప్రేమికులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కలిసి చావాలని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషాదకర ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని శనివారం రాత్రి చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదని తుమ్మల పెన్ పహడ్ గ్రామానికి చెందిన గుండా గాని సంజయ్ (26), చల్లగుండ నాగజ్యోతి (24) ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం అలమకుంది.

పెన్ పహడ్ గ్రామానికి చెందిన గుండ గాని సంజయ్, చల్లగుండ నాగజ్యోతి‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి కులాలు వేరు కావడంతో ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. ప్రేమికుల పెళ్లికి కుటుంబసభ్యులు అడ్డుపడ్డారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ప్రేమికులుతీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో కలిసి చావాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. తుమ్మల పెన్ పహడ్ గ్రామానికి చేరుకున్నారు. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ANN TOP 10