AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా.. కండువా కప్పారు.. ఆరోజే పార్టీకి గుడ్‌బై చెప్పా

ప్రజాశాంతి పార్టీలో చేరటంపై మాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబూ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తానసలు ఆ పార్టీలో చేరనే లేదని అన్నారు. కేఏ పాల్ ఓసారి కాఫీకి రమ్మంటే వెళ్లానని.. అక్కడ ఆయన తన మెడలో పార్ట కండువా కప్పి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారన్నారు. ఆ రోజే పాల్ పార్టీకి టాటా చెప్పినట్లు బాబూ మోహన్ వెల్లడించారు.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాళ్లకు చక్రాలు కట్టుకొని ఓటరు దేవుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తిగా కాగా.. నేడు పరిశీలన ఉండనుంది. ఇక వరంగల్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బబూ మెహన్ నామినేషన్ వేశారు. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించగా.. ఆయన ఆ పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు.

ఇదే విషయంపై ఆయన్ను వివరణ అడగ్గా.. ప్రజాశాంతి పార్టీలో చేరికపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను అసలు ప్రజాశాంతి పార్టీలో చేరనే లేదని చెప్పారు. బీజేపీ నుంచి బయటకు వచ్చాక.. కాఫీకి రావాలంటూ కేఏ పాల్ నుంచి పిలుపొచ్చిందని చెప్పారు. అలా ఆయన వద్దకు కాఫీకి వెళితే.. అనుహ్యంగా తన మెడలో కండువా కప్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారన్నారు. అయితే ఆ పార్టీలో తాను ఎలాంటి సభ్యత్వం తీసుకోలేదని.. తనకు కండువా కప్పిన రోజే ప్రజాశాంతి పార్టీకి టాటా చెప్పినట్లు వెల్లడించారు. వరంగల్‌లో పోటీ చేయాలని కొందరు అభిమానులు కోరటంతో తాను ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని అన్నారు.

ANN TOP 10