AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బిజీబిజీ ఎన్నికల ప్రచారంలోనూ మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఛాతి నొప్పితో బాధపడుతున్న వ్యక్తి కోసం తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌ను పంపించారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ ప్రాంతంలో రోడ్డు షో నిర్వహిస్తున్న సమయంలో జరిగింది. ముఖ్యమంత్రి రోడ్డు షోకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.

ఈ సమయంలో ఓ వ్యక్తి తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్నాడు. ఇది గమనించిన ముఖ్యమంత్రి అతనికి సహాయం చేయాలని తన కాన్వాయ్‌లోని అంబులెన్స్ సిబ్బందికి సూచించారు. ఓ వైపు బిజీబిజీగా ప్రచారం జరుగుతున్న సమయంలోనూ రేవంత్ రెడ్డి కనబరిచిన తీరుపట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ANN TOP 10